editorial

Mayday Special interview || K Illaiah మే డే స్పెషల్ ఇంటర్వ్యు

మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. పబ్లిక్ శెలవుదినం.చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి.

మే డే!.. మే దినోత్సవం… ప్రతి ఏడాది మే 1 వ తేదీ నాడు జరుపుకునే స్మారక దినం. పబ్లిక్ శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గర్హిస్తాయి.

కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు.

ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు.

చరిత్ర

యాంత్రికయుగం రాకముందు మనిషి గంటలకొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పనిగంటల పోరాటం వచ్చింది. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్‌ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్‌ చేశారు. కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.

1923లో మొదటిసారి భారతదేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.

ముఖ్యంగా, ఐ.టి.రంగంలో ఎంతోమంది ఆడపిల్లలు, యువకులు పనిచేస్తున్నారు. ఈనాడు మార్కెట్‌ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. అమెరికాలో వున్న కంపెనీలు అక్కడ ప్రజాచైతన్యం ఉన్నది కాబట్టి కార్మిక చట్టాలు అమలుకానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారు. మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీలో విద్యావంతులైన యువత ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. రాత్రుళ్లు ఆడపిల్లలను భద్రతలేకుండా ఇళ్ళకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నది.

పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంతవరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. కార్మిక చట్టాలను ఐ.టి. రంగంలో కూడా అమలుకై పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలకవర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. అసంఘటితరంగంలో అయితే సరేసరి. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన ఔట్‌ – సోర్సింగ్‌లోను కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవు.

ఉదాహరణకు : ఇంటర్మీడియట్‌ వ్యవస్థలో రెగ్యులర్‌ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగులే అధికమైనారు. అంతేకాకుండా ప్రభుత్వరంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. అందుకు నిదర్శనమే పై ఉదాహరణ.నిరుద్యోగాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారు. ఇది విద్యా, వైద్య రంగాల్లో ప్రయివేటీకరణ పెరిగిన కొద్దీ సర్వీసు భద్రత తక్కువవుతుంది కాబట్టి శ్రమదోపిడీ కూడా పెరుగుతుంది. వెనుకటికి స్కూళ్ళు 10 నుండి 14గంటల వరకు పనిచేసేవి. పిల్లవాణ్ణి ఆరు గంటల కంటే ఎక్కువ చదివించకూడదని విద్యావేత్తలు, పరిశోధకులు చెబుతున్నా, సెమీ రెసిడెన్షియల్‌, రెసిడెన్షియల్‌ పేర పాఠశాలలు సర్వసాధారణమైపోయాయి. ఆ టీచర్స్‌ నోరు మెదపకుండా 12 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రపంచీకరణ వలన వంద సంవత్సరాల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడంలేదు.1886లో ఆరంభమైన ఈ ఉద్యమం వందేళ్ళ పండగ జరుపుకుంది. ప్రపంచంలో ఎనిమిది గంటల పనికోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్‌ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాయి. ఆనాటి కార్మికవర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మే డే నాడు కొత్త స్ఫూర్తిని రగిలిస్తుందని ఆశిద్దాం. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు, మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని అసలు ఈ భూగోళాన్నే కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే.

Posted by 108TV TELUGU in editorial, video news, 0 comments
ప్లాస్టిక్ బియ్యం..ప్లాస్టిక్ గుడ్లు..ఏం తిని బతకాలి..?

ప్లాస్టిక్ బియ్యం..ప్లాస్టిక్ గుడ్లు..ఏం తిని బతకాలి..?

ప్లాస్టిక్ గుడ్లు..ప్లాస్టిక్ బియ్యం..కల్తీ పాలు..కల్తీ నెయ్యి..కల్తీ అల్లం వెల్లులి పేస్ట్..ఇలా అన్నింటిని కల్తీ చేస్తున్నారు. ఏం తిందామన్నా..ఏం కొందామన్నా.. కల్తీ కాటు భయపెడుతోంది. ఆకలి తీర్చే అన్నం..తాగే నీళ్లు…సర్వం కల్తీ మాయం. ధమ్ బిర్యాన్నిల్లోనూ కల్తీ వాడేస్తున్నారంటే అవి ఏ స్థాయికి వెళ్లిదంటే…ప్రశ్నించి వారిపై దాడుల చేసేదాకా..ఈ కల్తీ కేటుగాళ్ల గురించి ఎంత తక్కువ చెబితే అంతా మంచిదే. ఇలాంటోళ్లకు పీడీ కేసులు తగిలిస్తే గానీ దారికి రారు. వీళ్ల గురించి మాట్లాడం వదిలేసి.. కల్తీ వస్తువుల్ని ఎలా గుర్తుపట్టాలో చూడాలి.

ఇలా ప్లాస్టిక్ కోడిగుడ్లను గుర్తించండి

మామూలు గుడ్లలగే ఉంటాయి. వాటిని పగులకొట్టడం చాలా కష్టం
ఉడికిన తర్వాత గట్టిగా ఉంటాయి. రబ్బరు బంతిలా తయారవుతాయి.
కాలిస్తే ప్లాస్టిక్ లానే కాలిపోతాయి. రుచిలో కూడా తేడా ఉంటుంది.

ఇక ఇలా ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించండి

మామూలు బియ్యం కంటే తెల్లగా, బరువు తేలికగా ఉంటాయి.
ప్లాస్టిక్ బియ్యం నీటిలో తేలుతాయి.అసలు బియ్యం అయితే నీటిలో మునుగుతాయి. పైకి తేలిన గింజలు ఉంటే అందులో ప్లాస్టిక్ బియ్యం కలిసినట్లు గుర్తించాలి.
బియ్యాన్ని ఉడికించేటపుడు పాత్రల అంచుల్లో చిక్కని లేదా మందమైన పొర ఏర్పడుతుంది.
అగ్గిపుల్లతో అంటించినపుడు ప్లాస్టిక్ కాలిన వాసన వస్తుంది
వండిన అన్నం కొంత గిన్నెలో ఉంచండి. ఆ అన్నం పాచిపోతే మంచి బియ్యం, లేకపోతే ప్లాస్టిక్ బియ్యం
ఇలా ప్లాస్టిక్ గుడ్లు..ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించి..ఆరోగ్యాల్ని కాపాడుకోండి..

Posted by 108TV TELUGU in editorial, 0 comments
ర‌జినీ యుద్ధం ఎవ‌రిపై..?

ర‌జినీ యుద్ధం ఎవ‌రిపై..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిమానులతో దర్బార్ నిర్వహిస్తున్న ఆయన.. అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చాలా అరుదుగా మాత్రమే ప్రస్తావించిన ఒక అంశాన్ని ఆయన ప్రస్తావించ‌డం హాట్ టాపిక్ అవుతోంది.

కన్నడిగుడైన రజనీకాంత్ తొలుత బస్సు కండక్టర్ గా పని చేసి సినిమాల్లోకి రావటం.. ఆపై సూపర్ స్టార్ గా అవతరించి.. తిరుగులేని రీతిలో దశాబ్దాల తరబడి కొనసాగుతుండటం తెలిసిందే. తమిళుల ఆరాధ్యుడిగా ఉన్నప్పటికీ.. అంతర్రాష్ట్ర వివాదాలు ఏర్పడిన ప్రతిసారీ ఆయన్ను కన్నడిగుడిగా కొందరు ఎత్తిచూపిస్తూ విమర్శలు చేస్తుంటారు.

త్వరలో రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశం ఉందన్న మాటలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న వేళ.. తన స్థానికత గురించి.. తన మీద ప్రత్యర్థులు ఎత్తి చూపే లోపాన్ని తనకు తానే ప్రస్తావించి సమాధానం చెప్పటం ఆసక్తికరంగా మారింది. తాను కర్ణాటక నుంచి వచ్చినా తమిళుల అభిమానంతో తాను పూర్తిగా తమిళుడిగా మారిపోయినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటల్ని.. ఆయన మాటల్లోనే చూస్తే.. నేను కర్ణాటక నుంచి వచ్చినా మీ అభిమానంతో నన్ను పూర్తిగా తమిళుడిగా చేశారు. నాకు గొప్పగా స్వాగతం పలికారు. నేను కర్ణాటకలో 23 ఏళ్లు జీవించాను. అలాగే తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నాను. నన్నో నిజమైన తమిళుడిగా మార్చారు. నేను ఇప్పుడు పక్కా తమిళుడిని. రాజకీయ వ్యవస్థ కుళ్లుబట్టిపోయి ఉంది. దానిని ప్రక్షాళన చేయాల్సి ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా రజనీ నోట వచ్చిన మాటలు చూస్తే.. తనను తమిళుడ్ని కాదని ఎత్తి చూపే వారికి సమాధానం చెప్పటంతో పాటు.. తన మూలాల్ని ప్రస్తావించొద్దన్న మాట స్పష్టంగా చెప్పినట్లుగా చెప్పాలి. రాజకీయాల మీద కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. రజనీ నోట వచ్చిన ఈ మాటలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయనటంలో సందేహం లేదు. అయితే రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటూ ర‌జినీ ప‌రోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మ‌రి ర‌జినీ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు? వ‌స్తే రాజ‌కీయాల్లో ఎటువంటి సునామీ సృష్టిస్తారు అనే విష‌యాలే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Posted by 108TV TELUGU in editorial, 0 comments
NTR’s ‘Lava Kusa’ Teaser Expected to release for Eid

NTR’s ‘Lava Kusa’ Teaser Expected to release for Eid

NTR’s ‘Lava Kusa’ Teaser Expected to release for Eid : NTR’s ‘Jai Lava Kusa’ movie teaser to be unveiled soon. Recently makers have released the ‘Jai Lava Kusa’ poster and it got a tremendous response from the audience. Now, makers are planning to release the teaser as an Eid gift to the audience. The teaser is to be rolled out on 21st June.

NTR’s ‘Lava Kusa’ Teaser Expected to release for Eid

KS Ravindra alias Bobby is directing this film. He earlier did the projects like Sardaar Gabbar Singh with Pawan Kalyan, Power with Raviteja. Actor and producer Nandamuri Kalyan Ram are producing this film under NTR Arts Banner.

For the first time, Young Tiger NTR will be appearing in a triple role in this film. Kannada fame Duniya Vijay is roped to play the antagonist role in this film while two beauties Raashi Khanna and Niveda Thomas are playing the female lead roles besides NTR. Well-known actors Posani Krishna Murali, Jaya Prakash Reddy, Prabhas Sreenu, and other will be seen in supporting roles in this film.

Most known music director Devi Sri Prasad is composing music for this movie. NTR fans are having tons of expectations on the film. Jr NTR recently gave a super hit film ‘Janatha Garage’; the audience is expecting that the film ‘Jai Lava Kusa’ will become the biggest blockbuster hit in NTR’s career. The movie is expected to hit the screens on 1st September while the exact date will be announced by the makers soon.

Posted by 108TV TELUGU in editorial, 0 comments